Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మద్దుతూ ధర కోసం అన్నదాత ధర్నా

Author
Posted By HINDUSTAN
| 27 Nov 2021, 03:42 PM | వ్యవసాయం


తమకు మద్దతు ధర ఇవ్వాలని ఆందోళన..



రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మద్దతు ధరలో కోత పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. ముందు రోజు పత్తి ధర రూపాయలు 8130 ఉండగా , శనివారం కూడా అదే ధర ఉంటుందని రైతులు అధిక మొత్తం లో పత్తిని మార్కెట్ కి తీసుక వచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి తాంసి బస్టాండ్ వరకు పత్తి బండ్లు వరుసగా బారులు తీరాయి..
శుక్రవారం నాటి పత్తి ధర రూపాయలు 8130 తో పోలిస్తే శనివారం పత్తి ధర రూపాయలు 7960 ఏకంగా 170 రూపాయలు ధర తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహించారు. తమకు మద్దతు ధర ఇవ్వాలని, తమకు శుక్రవారం నాటి ధర తోనే తాము తెచ్చిన పత్తి నీ కొనాలని రైతులు ధర్నాకు దిగి ఆందోళన చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కాసేపు పత్తి కొనుగోలు స్థంభించి పోయింది. కొందరు ప్రైవేట్ వ్యాపారస్తులు, దళారులు కావాలనే ఇలా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల జోక్యం తో చివరకు మద్దతు ధర 8000 రూపాయల తో కొనుగోలు చేస్తామని అధికారులు తెలియజేయగ రైతులు ధర్నా చేయడాన్ని విరామించుకున్నారు..

ఇవి కూడా చదవండి