Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (జనవరి 21) : రామకృష్ణాపూర్ ఆర్కేవన్ ఏ గని మీద స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సీఎంఆర్ 2017 ప్రకారం పని ప్రదేశంలో ఉద్యోగుల వ్యక్తిగత భద్రత పై అవగాహన పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిపిఎ రీజియన్ సేఫ్టీ జీఏం జాన్ ఆనంద్ మాట్లాడుతూ ఆర్కెవన్ ఏ రెండు సార్లు ఫైవ్ స్టార్ సాధించినందుకు అధికారులను, కార్మికులను కొనియాడారు. అనంతరం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ బి ఓదెలు,కేకే గ్రూప్ ఏజెంట్ రామ దాసు మాట్లాడుతూ అందరూ ఉద్యోగుల వ్యక్తిగత బాధ్యతల పై భద్రత అవగాహన పాటించాలని, ప్రమాదాలు 98 శాతం మానవ తప్పిదాల వల్లనే జరుగు తున్నాయని అలా జరగకుండా అందరూ భద్రతతో పని చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏంటి సిఎస్ఓఏం విజయ్ కుమార్, డివైజీఏం ఏ శ్రీధర్ రావు, సేఫ్టీ ఆఫీసర్ బి జయంత్ కుమార్, పిట్ ఇంజనీర్ సతీష్ కుమార్, సర్వేయర్ నజీర్ఉద్దీన్, సీనియర్ అండర్ మేనేజర్ కే రవి, గని వెల్ఫేర్ ఆఫీసర్,జే శ్రీనివాస్, ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ ఎస్ వినయ్, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీ బి బిక్షపతి, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.