republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 October 2024, 4:10 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

12 ఏళ్లుగా మహిళా కడుపులో కత్తెర…!

హైదరాబాద్ :  ఓ మహిళ కడుపులో గత 12 ఏళ్లుగా కత్తెర ఉంది దాదాపు ఆమె పది సంవ త్సరాలుగా  కడుపులో నొప్పితో బాధపడుతూనే ఉంది, 12 సంవత్సరాలుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయము కనిపెట్టలేక పోయారు.

కడుపునొప్పితో  హాస్పిటల్‌కి వెళ్లిన ఒక 45 ఏళ్ల మహిళకు డాక్టర్లు ఊహించని షాకిచ్చారు. ఎక్స్‌రే తీసి చూసి ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. ఒకరకంగా ఇది పేషెంట్‌కి, ఆమె కుటుంబ సభ్యులకే కాదు.. ఆ హాస్పిటల్ డాక్టర్లకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

సిక్కింలో 12 ఏళ్ల క్రితం అపెండిసైటిస్ నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ వైద్యం కోసం గ్యాంగ్‌టక్‌ లోని సర్ తుటోబ్ న్యామ్‌గల్ మెమోరియల్ హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమెకు అపెండిసైటిస్ సర్జరీ చేశారు.

డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చినా ఆమెకు కడుపులో నొప్పి తగ్గలేదు. ఆ తరువాత కడుపు నొప్పికి పరిష్కారం కోసం ఆమె ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో చేసేదేం లేక ఇటీవల, అంటే అక్టోబర్ 8న ఆమె మరోసారి తనకు అప్పట్లో అపెండిసైటిస్ సర్జరీ చేసిన ఎస్టీఎన్ఎం హాస్పిటల్‌కి వెళ్లారు.

ఎస్టీఎన్ఎం హాస్పిటల్లో ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూసి షాకయ్యారు.
ఆమె పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు వారికి స్పష్టంగా కనిపించింది. అది కూడా 2012 లో ఆమెకు ఆ సర్జరీ చేసింది అదే హాస్పిటల్లో అని తెలిసి మరింత షాకయ్యారు. వెంటనే ఆ మహిళకు సర్జరీ చేసి ఆ కత్తెరను తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారు.

ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో ఆస్పత్రి బయట బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానిక ప్రజా సంఘాలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి.

దీంతో సిక్కిం వైద్య ఆరోగ్య శాఖ ఎస్టీఎన్ఎం హాస్పిటల్ నిర్వాకంపై విచారణకు ఆదేశించింది.

Thank you for reading this post, don't forget to subscribe!