republichindustan.in
Newspaper Banner
Date of Publish : 27 March 2024, 9:34 am Digital Edition : REPUBLIC HINDUSTAN

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డేటా ఎంట్రీ ఆపరేటర్

*సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తితో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.* గతంలో హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీసులో అతను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసినట్లు సమాచారం. మెదక్‌ జిల్లా పీర్లతండాకు చెందిన రవినాయక్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు *నరేశ్ కుమార్, కొర్లపాటి వంశీ, వెంకటేష్‌గౌడ్, ఓంకార్‌* లను అరెస్ట్ చేశారు.

*మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన రవి నాయక్‌ భార్య లలితా 2022లో పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైంది.* ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో రూ.5 లక్షలు బిల్లు కావడంతో 2023లో రవి సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇటీవల సచివాలయానికి వచ్చి అతను ఆరా తీశాడు. అయితే రెండు చెక్కుల ద్వారా రూ.87,500 వచ్చినట్లు అధికారులు రవి ఘనాయక్‌కు చెప్పారు.తన విజ్ఞప్తికి స్పందన రాక ఇబ్బందులు పడుతుంటే, తన పేరు మీద అప్పటికే ఎవరో చెక్కు తీసుకుని డబ్బు డ్రా చేశారన్న విషయం తెలిసి ఏదో గందరగోళం జరిగిందని రవి భావించాడు. ఈ క్రమంలోనే ఆరా తీయగా గతంలో మంత్రి హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసిన నరేశ్‌, ఓంకార్ సాయంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.5లో చెక్కులు డ్రా చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈనెల 21వ తేదీన జూబ్లీహిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.