వ్యక్తిగత ఆస్తి రద్దు - సమసమాజ స్థాపన : అవినీతి రహిత నూతన మానవత్వానికి ఏకైక మార్గం
*వ్యాస రచయిత : క్రాంతి త్రినేత్రుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి* *ఫోన్ : 8328277285, 9848540078* --- అవినీతిని నిందించడం కాదు - అవినీతికి అవకాశాలను నిర్మూలిద్దాం! *వ్యక్తిని మాత్రమే మార్చడం కాదు - వ్యవస్థను మార్చాలి!* *వ్యక్తిగత ఆస్తి ఆధిపత్యం నుండి సామాజిక స్వామ్యానికి - దోపిడీ రహిత, వర్గరహిత సమాజం వైపు!* సమాజంలో ఎక్కడ చూసినా ఒకే ఆవేదన - “అవినీతి పెరిగిపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది, ప్రజాధనం దోచుకుంటున్నారు, అధికారంలోకి వచ్చినవారు కోట్లకు పడగలెత్తుతున్నారు, చిన్న ఉద్యోగి నుండి పెద్ద అధికారి వరకు లంచాలు, రాజకీయ నాయకులు ప్రజల కోసం కాదు తమ ఆస్తుల కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు” అని ప్రతిరోజూ వింటున్నాం....