తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా

ముఖ్యమైన పాయింట్స్:ఖతార్‌లో తెలుగు సోదరుల సహకారంతో రూ.1.20 లక్షల ఆర్థిక సహాయం అందజేత *నడికుడ:* జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన తలారి ముత్తన్న (55) ఖతార్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ గల్ఫ్ సమితి, తెలుగు సోదరుల సహకారంతో రూ.1,20,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకుంది. ముత్తన్న మృతి వార్తను కుటుంబ సభ్యులు తెలంగాణ గల్ఫ్ సమితి దృష్టికి తీసుకురాగానే సమితి ప్రతినిధులు స్పందించారు. ఖతార్‌లోని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తరలించేందుకు కీలకంగా కృషి చేశారు. అనంతరం మృతుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న...