ఒమాన్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాలపై అవగాహన

ముఖ్యమైన పాయింట్స్:ఉద్యోగుల ఫీజు చెల్లించడానికి, వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయడానికి ముందుకొస్తున్న సంస్థలు ఒమాన్: గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించిన ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాలపై ఒమన్ ‌లో తెలుగు వారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామజిక కార్యకర్త బొక్కెన గంగస్వామి అధ్యక్షత వహించగా, అతిథులుగా గోల్డెన్ ప్యూరిటీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి షేక్ మదర్, సామాజిక కార్యకర్తలు చిట్టుమల దీపక్, మైదమ్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా బానోత్ రవి, గుర్రపు మహేందర్, అజిగి శేఖర్, ముంజ మహేష్, షేక్ ఫరూక్,...