సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు
రియాద్: సౌదీ అరేబియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ఆధ్వర్యంలో సౌదీ నేషనల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాటా సభ్యులు, పాల్గొని సౌదీ అరేబియా జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సౌదీ అరేబియాలో ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చిన భారతీయులుగా, సౌదీ ప్రజలతో కలిసి మమేకమై, పరస్పర గౌరవం మరియు స్నేహభావంతో ముందుకు సాగడం ఎంతో ఆనందంగా ఉందని సాటా వ్యవస్థాపకులు మల్లేశన్ తెలిపారు. ఈ సందర్భంగా సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ, “మనం భారతీయులమైనప్పటికీ సౌదీ అరేబియా మనకు ఉపాధి, అవకాశాలను అందిస్తున్న మరో ఇల్లులాంటిది. ఇక్కడి ప్రజలతో కలిసిమెలిసి...