దండంపల్లిలో స్కంద లైఫ్‌లైన్ హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్

నల్గొండ రూరల్ సెప్టెంబర్ 20 నేటి వెలుగు ప్రతినిధి: దండంపల్లి గ్రామంలో స్కంద లైఫ్‌లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది. చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ రాగ మాలికాదేవి, జనరల్ మెడిసిన్ డాక్టర్ మణికంఠ, జనరల్ సర్జన్ డాక్టర్ రూపేష్, చర్మవ్యాధుల నిపుణురాలు డాక్టర్ భవ్య బాలిని పాల్గొని సుమారు 100 మంది ఓపీ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా **ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.** అలాగే ఈరోజు నుంచి మూడు రోజుల పాటు హాస్పిటల్‌లో **ఉచిత ఓపీ సేవలు**...