ట్రేడింగ్ పేరుతో, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
కోటి 70 లక్షల రూపాయలు మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు, అరెస్ట్ చేసి రిమాండ్ నిందితుడు: విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న వ్యక్తి ఆదిలాబాద్ , హిందుస్థాన్ : ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం— ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో నిజామాబాద్‌కు చెందిన గుడూరు ఉమారాణి (45), ప్రైవేట్ టీచర్, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, 2014లో సల్మాన్ అలియాస్ సోలోమన్ రాజ్ (తండ్రి: సామూలే) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నానని నమ్మబలికాడు. 2018లో వ్యక్తిగత అవసరాల కోసం...