మద్యం మత్తులో మహిళ హత్యాచారానికి యత్నం, ప్రతిఘటించిన మహిళ, హత్య చేసిన నిందితుడు.

హత్య కేసుగా మారిన అనుమానస్పద మృతి. సాంకేతిక ఆధారాలతో కేసును చేదించిన వన్ టౌన్ పోలీసులు. కేసు చేదించిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదిలాబాద్ : శుక్రవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక పంజాబ్ కూడలి వద్ద గల మురికి కాలువలో అనుమానస్పదంగా మృతి చెందిన మహిళ అనిత కేసును హత్యకేసుగా ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తేల్చడం జరిగింది. నిందితుడి వివరాలునర్సింగా సంతోబా గంపల్వాడ్ (25) s/o సంతోబా, కులం: కోలి, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్/కూలీ, నివాసం: సిరంజని గ్రామం, హిమాయత్ నగర్ తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర. ఆదిలాబాద్ వన్...