అల్‌కిఫాహ్ టోర్నమెంట్ గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగిసింది
జెద్దా, ఏప్రిల్ 3: అల్‌కిఫాహ్ టోర్నమెంట్ నెంబర్ 2026-123 గ్రాండ్ ఫినాలే మ్యాచ్ ఘనంగా నిర్వహించబడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ పోరులో రెండు జట్లు అద్భుతమైన ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను అలరించాయి. మ్యాచ్ ఫలితాలు ఇలా ఉన్నాయి: గోల్డెన్ సీసీ జట్టు 15 ఓవర్లలో 204 పరుగులు చేయగా, ఈజాక్ సీసీ జట్టు 15 ఓవర్లలో 202 పరుగులు చేసి కేవలం 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చివరి వరకూ ఉత్కంఠను రేపిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ టోర్నమెంట్‌ను హైదరాబాద్‌కు చెందిన నయీమ్ నాయకత్వంలోని అల్‌కిఫాహ్ ఆర్గనైజింగ్ టీం 2016 నుండి జెద్దాలో విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా SATA...