అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం – నేడు ‘బ్లడ్ మూన్’ ఆకాశంలో కనువిందు

🌕న్యూఢిల్లీ: ఆకాశ వీక్షకులకు నేడు అరుదైన ఖగోళ విందు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోనుండడంతో ఈ దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్ మూన్’గా పిలుస్తారు. భూమి సూర్యుడు–చంద్రుడు మధ్యలోకి రావడంతో భూమి నీడ పూర్తిగా చంద్రుడిని కమ్మేస్తుంది. ఈ సందర్భంలో సూర్య కిరణాలు భూమి వాతావరణం ద్వారా వక్రీభవించి చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. 🕒 గ్రహణ సమయాలు (భారత కాలమానం – IST) 🌑 గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 🔴 సంపూర్ణ దశ ప్రారంభం: సాయంత్రం సుమారు 5:30 🌕 గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 భారత్‌లో చాలా ప్రాంతాల్లో చంద్రోదయం సాయంత్రం 6 గంటల...