ఇచ్చోడాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

ఇచ్చోడా (ఆదిలాబాద్ జిల్లా): Swami Vivekananda జయంతిని ఇచ్చోడాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ ఇచ్చోడా మండల చైర్మన్ గిత్తే ప్రహ్లాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మానవ హక్కుల కార్యకర్తలు, గ్రామ పెద్దలు హాజరై వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా గిత్తే ప్రహ్లాద్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన చూపిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వ వికాసం, సేవాభావం, దేశభక్తి వంటి విలువలను జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆమ్టె మాధవరావు సహా...