మున్సిపల్ ఓటరు జాబితాపై అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలి

– రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జనవరి 07, 2026 – ఆదిలాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 12న వార్డుల వారీగా ఫోటో ఎలక్ట్రోల్ ఓటరు జాబితాలను ప్రచురించడంతో పాటు, 13న డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. అలాగే 16న తుది...