సౌదీ అరబియా రియాద్ లో ఇంజనీరింగ్ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఇంజనీరింగ్ దినోత్సవం (Engineers' Day) సౌదీ అరబియాలో మన తెలుగు వారు కలిసి జరుపుకోవడం అనేది చాలా ఆనందముగా వున్నది అని SATA TBN అధ్యక్షలు యోగేశ్వర రావు వీరవల్లి అన్నారు. SATA రియాద్ అధ్యక్షలు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటాము. ఇది ప్రముఖ ఇంజనీర్, స్వాతంత్య్ర సమరయోధుడు, మరియు భారతరత్న పురస్కార గ్రహీత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం, ఆయన పుట్టినరోజున జరుపుకునే దినోత్సవం. ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలను, ముఖ్యంగా నీటిపారుదల, జలవనరుల నిర్వహణలో ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ,...