ఆదిలాబాద్‌లో మహిళపై అ*త్యాచారం, దోపిడీ, హత్యాయత్నం కేసు – నిందితుడు అరెస్ట్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ - క్రైమ్ : ఆదిలాబాద్ పట్టణంలో ఈనెల 8వ తేదీన మహిళ యాచకురాలిపై అత్యాచారం, దోపిడీ, హత్యాయత్నానికి పాల్పడిన గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కూలీ పని చేసుకునే  నిందితుడు మాడవి నగేష్ @ నాగోరావు @ నాగేశ్వర్ (25) ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు సోమవారం రోజు ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరానికి పాల్పడిన విషయం ధృవీకరించబడిందనీ తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచనల మేరకు ఎలాంటి ఆధారాలు లేకున్నా ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల 40 పోలీస్ స్టేషన్లలో గాలింపు...