ADB: విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుల పై తీసుకున్న చర్యలు ఇవే : కలెక్టర్
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పారు. పాఠాలు నేర్పించాల్సిన చోట విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అలాంటి ఉపాధ్యాయుల పై తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.. అదిలాబాద్ జిల్లాలో విద్యా సంస్థలలో జరిగిన అసభ్య ప్రవర్తన సంఘటనలపై తీసుకున్న చర్యలు -- జిల్లా కలెక్టర్ రాజర్షి షా అదిలాబాద్ జిల్లాలో రెండు విద్యా సంస్థలలో చోటుచేసుకున్న బాలలపై అసభ్య ప్రవర్తనలకు సంబంధించి జిల్లా పాలన యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుందనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన సంఘటనల వివరాలు మరియు తీసుకున్న చర్యలు గురించి వెల్లడించారు. 1 . తాంసి మండలంలోని జెడ్పీ...