ఆదిలాబాద్‌లో నకిలీ ఆయుర్వేద వైద్యంతో మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదిలాబాద్ జిల్లా, జూలై 29, 2025 , రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో 8 కేసులు నమోదు, 9 మందిపై చీటింగ్ కేసు (BNS 318(4), 316). 8 మంది అరెస్టు, ప్రధాన నిందితుడు కుమార్ @ బాబా (66, గుల్బర్గా, కర్ణాటక) పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముఠా...