తాగుబోతు భార్యలు - పోలీసులకు భర్తల ఫిర్యాదు

భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు! ఒడిషా : మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుందని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపో యారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నారని, పురుషలోకం  లబోదిబోమంటున్నారు. మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము కూలి పనులు చేసిన సంపాదిస్తు న్నదంతా సారాకు తగలేస్తున్నారని, మీరే తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయానికి గురిచేసే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వెలుగుచూసింది. బొరిగుమ్మ సమితిలోని పూజారిపుట్‌ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు.. తమ భార్యలపై పోలీసులకు...