కేసుల నమోదులో జాప్యం చేయవద్దు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.*

*ఘన్పూర్ చెక్పోస్ట్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ* *బోథ్, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ.* *సిబ్బంది కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూడాలి.* అదిలాబాద్ :    కేసుల నమోదులో చాప్యం చేయకుండా సక్రమంగా కేసుల నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మరియు బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోథ్ పోలీస్ స్టేషన్ నందు ఒక మొక్క నాటి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలపై వాటి స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి...