రంగరాజన్‌‌పై దాడి విషయంలో RSSపై దుష్ప్రచారం.. చర్యలకు సిద్ధమవుతున్న RSS

హైదరాబాద్ : చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వ్యక్తులతో తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌- RSS ప్రకటించింది. దాని చేసిన వ్యక్తులు స్వయంసేవకులు అని, ఆ సంస్థకు తమకు సంబంధాలున్నాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. రంగరాజన్‌పై దాడి చేసిన మొదటి రోజే తాము ఖండించినట్లు RSS వివరించింది. దోషులపై సత్వరం చర్యలకు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు స్పష్టం చేసింది. RSS‌ని అప్రతిష్టపాలు చేసేందుకు, దాడి కారకులను తమకు ముడిపెట్టి దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడింది. తప్పుడు చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఇప్పటికే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు RSS ప్రకటించింది. దాడిని ఖండిస్తూ ఈ...