నార్నూర్ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం : ఏఎస్పి
*డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన డ్రైవర్.* *నార్నూర్ ప్రమాద ఘటనపై ఉట్నూర్ ఎఎస్పి కాజల్ ఐపీఎస్ వివరణ.* *డ్రైవర్ పై కేసు నమోదు, విచారణ కొనసాగుతుంది.* *ఇప్పటివరకు ఇద్దరు మృతి, 35 మందికి రిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స.* వివరాలలో : గుడియత్నూరు మండలం సూర్యగుడకు సంబంధించిన ఆదివాసీలు 50 మంది ఐచర్ వాహనం నందు నార్నూర్ మండలంలోని కప్లే దేవస్థానం కు ఇంటి దేవతల స్నానాల నిమిత్తం బయలుదేరడం జరిగింది. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో సాయంత్రం 4:30 గంటల సమయంలో నార్నూర్ మండలంలోని మాలేపూర్ గ్రామ శివారులో ఘాట్ సెక్షన్ వద్ద మూలమలుపు తిరుగుచుండగా ఐచర్ బోల్తా పడినది. ఈ...