రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... ముగ్గురికి తీవ్ర గాయాలు

రిపబ్లిక్ హిందుస్థాన్, సిర్పూర్ (యు) 28 : సిర్పూర్ (యు) మండలంలోని మహాగం సమీపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిర్పూర్ (యు) ఎస్ ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారంగా అతివేగంగా రెండు వాహనాలు నడుపుతూ ద్విచక్ర వాహనాలు రెండు ఢీకొనడంతో లింగాపూర్ మండలం పిట్టగూడా గ్రామానికి చెందిన మరప లింగు కుమారుడు మరప శంభు (35) అక్కడికక్కడే మృతి చెందారని ఎస్సై తెలిపారు. మరో ముగ్గురికి ఆ వాహనాలపై వెళ్తున్న లాల్ ప్రసాద్, గణేష్, చంద్రకాంత్ లకు తీవ్ర గాయాలు...