రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్.....<br>• బిజెపి ని విమర్శిస్తే ఊరుకునేది లేదు
- గాజుల రాకేష్ BJYM బోథ్ అసెంబ్లీ IT కన్వీనర్ తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని, కాంగ్రెస్ నాయకులను రైతులు గ్రామాల్లో తిరగనివ్వొద్దని బిజెపి యువమోర్చా బోథ్ అసెంబ్లీ ఐటి, సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత రైతుల కష్టాన్ని కర్ణాటక రైతులకు కాంగ్రెస్ పార్టీ దోచిపెడుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణరాష్ట్రంలో క్వింటాలు పత్తి రేటు 7521 రూపాయలు ఉంటే, కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో 8972 రూపాయలు ఉందని దీని ఆంతర్యం ఏంటని అన్నారు. కర్ణాటకలో, తెలంగాణలో పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా కొనుగోళ్లలో వ్యత్యాసం ఎందుకు ఉందని, దాని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. దేశ...