విధుల గుండా కుక్కల స్వైర విహారం....  దడ పుట్టిస్తోన్న కుక్కల గుంపు...

*ఏ గల్లీలో చూసిన డజన్ల కొద్ది తిరుగుతున్న కుక్కలు *భయం గుప్పెట్లో నందిగామ గ్రామ ప్రజలు *స్కూల్ విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం *వీధి కుక్కలను బంధించి..ప్రజలకు రక్షణ కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు, విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య డిమాండ్. రిపబ్లిక్ హిందుస్థాన్,  నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామము లో వీధి కుక్కలు ఏ గల్లీలో చూసిన డజన్లకొద్దీ కలియ తిరుగుతూ, స్వైరవిహారం చేస్తున్నాయని, బాటసారులను, బైకర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అదేవిధంగా ఒంటరిగా కనిపించిన వ్యక్తులను, స్కూల్ పిల్లలను తరుముతూ..ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పలుమార్లు ముకుమ్మడిగా దాడులు చేస్తూ..భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి....