ఇక ఒకే దేశము ఒకే ఎన్నికలు అమలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్?
జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం న్యూ ఢిల్లీ : జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ (ఒకే దేశం-ఒకే ఎన్నిక) కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేసింది. **శీతాకాల సమావేశాల్లో బిల్లు**: ఈ బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. గత ఏడాది నుంచే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై ప్రభుత్వం దృష్టి సారించింది... రామ్ నాథ్ కోవింద్ కమిటీ: 2024 ఎన్నికలు కూడా జమిలి పద్ధతిలో నిర్వహించాలని భావించారు కానీ సాధ్యపడలేదు. ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్ నాథ్ కోవింద్...