Telangana GP Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల తయారీ షెడ్యూల్ ఖరారు..

TG Grama Panchayati Elections : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు, పంచాయతీల్లోని వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీ నాటికే పంచాయతీల పదవీ కాలం ముగిసింది. గత ఏడాది డిసెంబరులోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కేవలం రెండు నెలల తేడాతోనే ఎన్నికల నిర్వహణకు పోలేకపోయింది. ముఖ్యంగా మార్చిలోనే లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో పంచాయతీ ఎన్నికల విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి, గ్రామాల పాలనను స్పెషల్ అధికారుల చేతుల్లో పెట్టింది. 2019లో తెలంగాణలోని 12, 769 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో జనవరి 21,...