రంగారెడ్డి జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం - మహిళ మృతి
రంగారెడ్డి : జిల్లాలోని మొయినాబాద్ మండలంలో వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలు కోల్పోయింది.. కాలికి గాయమైందని శస్త్ర చికిత్స కోసం ఆస్పత్రికీ వచ్చింది… శస్త్ర చికిత్స చేస్తుండగా వైద్యం వికటించి మహిళా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు మృతురాలి కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండల పరిధిలోని అండాపూర్ గ్రామానికి చెందిన మద్దెపాగ రమేష్ భార్య మద్దెపాగ సావిత్రి (30) ఐదు రోజుల క్రితం ఇంటివద్ద ప్రమాదవశత్తు కిందపడి కాళ్ళకి తీవ్ర గాయం అయింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక భాస్కర ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకొచ్చారు....