రెవెన్యూ అధికారి ఇంట్లో ఏసీబి సోదాలు... భారీగా  గుర్తించిన నగదు 2.93 కోట్లు...  ఆస్తులు..?

నిజామాబాద్‌ : నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భారీగా నగదు, బంగారం గుర్తించినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 5గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో రూ.6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్‌లోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోని అశోక టవర్‌లో ఉన్న నరేందర్ ఇంట్లో ఏకంగా రూ.2.93 కోట్ల నగదు గుర్తించారు. అలాగే ఆయన భార్య బ్యాంకు ఖాతాలో రూ.1.10 కోట్ల...