History : స్వర్ణముఖి నది పై ప్రత్యేక కథనం
ఆంధ్రప్రదేశ్ తిరుపతి : తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ధూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది. ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది. ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి నదిని దేవలోకం...