శ్రీకాళహస్తి-తిరుపతి హైవేపై బస్సు దగ్ధం..

అమరావతి: మే 19 ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తి-తిరుపతి హైవేపై ఆదివారం తెల్లవారుజాము న ప్రయివేటు బస్సు దగ్ధమ య్యింది. రేణిగుంట సమీపంలోకి రాగానే బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్‌.. అప్రమత్తమై వెంటనే బస్సును ఆపేసి ప్రయాణి కులను దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.