AP CRIME : విశాఖలో దారుణం... కాలేజీ భవంతి పైనుంచి దూకి 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య<br>
ఆత్మహత్యకు ముందు కుటుంబసభ్యులకు మేసేజీలు తాను లైంగిక వేధింపులకు గురయ్యాయనని ఆవేదన నిందితులు తన ఫొటోలు బయటపెడతామంటూ బెదిరించారని వెల్లడి తాను వెళ్లిపోకతప్పదంటూ చివరి మెసజ్ విశాఖలో 17 ఏళ్ల విద్యార్థిని కాలేజీ భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తాను లైంగిక వేధింపులకు గురయ్యానంటూ కుటుంబసభ్యులకు మెసేజ్ చేసి బాలిక బలవన్మరణానికి పాల్పడింది. నిందితుల వద్ద తన ఫొటోలు ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ వారు బెదిరించారని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు వైజాగ్‌లోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. ఆమె కుటుంబం అనకాపల్లి జిల్లాలో ఉంటోంది. కాగా, బాలిక అదృశ్యమైనట్టు గురువారం రాత్రి 10...