అత్యాశకు ఆశపడి చోరికి పాల్పడిన మహిళ
*వారం రోజుల్లోనే కేసును చేదించిన జైనథ్ పోలీసులు.* *దొంగలించబడిన సొత్తు రికవరీ.* రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : జైనథ్ మండలం మాకోడ గ్రామంలో ఈనెల 11 వ తారీఖున నిమ్మల రవికాంత్ రెడ్డి ఇంట్లో పట్టపగలు చోరీ జరిగిందన్న పిర్యాదు మేరకు అదే రోజు సంఘటన స్థలాన్ని జైనథ్ సిఐ డి.సాయినాథ్ మరియు ఎస్సై పురుషోత్తం పరిశీలించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన *లక్ష్మీ* అనే మహిళ ఇంట్లో ఎవరు లేని సమయంలో, ఫిర్యాదుదారుడు ఇంటి కి తాళం చెవి వేసి తాళం చెవి ఇంటి ముందు ఉన్న గూట్లో పెట్టడాన్ని గమనించి ఎవరు లేని సమయంలో ఆ ఇంటి లోనికి ప్రవేశించి బీరువాలో గల...