వేసవిలో  త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయండి : జిల్లా కలెక్టర్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : వేసవిలో  త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఆన్ని ఏర్పాట్లు చేయాలని  ఎంపీడీఓ, ఎంపీఓ, ఆర్ డబ్యుఎస్ అధికారులను జిల్లా పాలనాదికారి రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్, త్రాగునీటి సరఫరాపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎండాకాలంలో ఎక్కడ త్రాగునీటి సమస్య రాకుండా ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హ్యాండ్ పంప్, పుంపు సెట్ రిపేర్లు చేసి వాటి వాడుకలోకి తీసుకురావాలని, మిషన్ భగీరథ లీకేజ్ లను మరమ్మత్తు చేయాలనీ సూచించారు. అవసరమైన చోట కొత్త పైపులు, హౌస్ హోల్డ్ కనెక్షన్ లు అందించి నీరు సరఫరా పూర్తిగా...