ఇండోనేషియాలో వర్ష బీభత్సం.. 21 మంది మృతి.. ఏడుగురు గల్లంతు
ఇండోనేషియా:మార్చి 10ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర ప్రాంతంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదల ప్రభావంతో 21 మంది ప్రాణాలు కోల్పో యారు. వరదల్లో ఏడుగురు గల్లంత య్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 150 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపు 70వేల మంది నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయకులైన వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి వరదలు బీభత్సం సృష్టిం చగా.. పడాంగ్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో దాదా పు 200 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వంతెనలు, రోడ్లు దెబ్బతి న్నాయి. వరదలతో పాటు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా మార్గాలు మూసుకుపోయా...