1994లో హత్య.. 2024లో కేసును ఛేదించిన పోలీసులు.!
30 ఏళ్ల నాటి హత్య కేసులో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి లండన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అది కూడా ఫోరెన్సిక్ టెక్నాలజీలో ఆధునికత వల్లే ఈ హత్య కేసును లండన్ పోలీసులు విజయవంతంగా ఛేదించగలిగారు. హంతకుడు భారత సంతతికి చెందిన సందీప్ పటేల్ కాగా, బాధితురాలు మరీనా కోపెల్. 1994లో లండన్‌లోని అపార్ట్మెంట్లో మరీనాను 140 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు సందీప్ పటేల్. అప్పటికి మరీనా వయసు 39, పటేల్ వయసు 21 ఏళ్లు. తాజాగా లండన్ కోర్టు శుక్రవారం పటేల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గతేడాది జనవరిలో మరీనా కోపెల్ చేతి ఉంగరానికి చిక్కుకుని ఉన్న...