కౌన్సిలర్ దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామ మూడో వార్డు కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ఇనుప రాడుతో ముగ్గురిపై దాడికి దిగగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కౌన్సిలర్ రవీందర్ గ్రామంలోని సర్వే నెంబర్ 407 లో అక్రమ నిర్మాణం చేపడుతూ, బోర్ వేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మర్రి మల్లికార్జున్, కొలకాని రవిప్రసాద్, మేడిపల్లి రమేష్ అనే ముగ్గురు వ్యక్తులు మీడియాతో మాట్లాడుతుండగా, అక్కడే ఉన్న కౌన్సిలర్ రవీందర్ ఇనుప రాడుతో ఒక్కసారిగా ముగ్గురిపై దాడికి దిగాడు. దీంతో మర్రి మల్లికార్జున్ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుల కథనం మేరకు...