పాకిస్తాన్ రేంజర్ల దాడి..తిప్పికొట్టిన భద్రతాబలగాలు..!!
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని సరిహద్దులో బీఎస్ఎఫ్ పోస్టుపై పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఈ దాడిని బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. దాదాపు 20 నిమిషాలకు పైగా బీఎస్ఎఫ్, పాకిస్థాన్ రేంజర్ల మధ్య ఈ కాల్పులు జరిగాయి. అధికారులను ఉటంకిస్తూ పీటీఐ ఈ సమాచారం ఇచ్చింది. అంతకుముందు 2023 నవంబర్‌లో కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందాడు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి, ఫిబ్రవరి 25, 2021 న, భారత్, పాకిస్తాన్ సైన్యాలు...