'ఎస్ఎంఎస్ ఓటీపీ'లకు గుడ్‌బై..

స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ లావాదేవీల ధృవీకరణ కోసం చాలకాలంగా వినియోగంలో ఉన్న ఓటీపీ (One Time Password) విధానం మరుగున పడనుందా?.. ఓటీపీ స్థానంలో మరో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుందా? ఇందుకోసం కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కసరత్తు సిద్ధం చేస్తోందా?.. అంటే ఔననే సమాధానమిస్తున్నాయి రిపోర్టులు. డిజిటల్ చెల్లింపుల ధృవీకరణకు ఓటీపీలు ఉపయోగపడుతున్నప్పటికీ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. దీంతో ఈ విధానానికి చెక్ పెట్టాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ భావిస్తోంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఓటీపీల స్థానంలో అథెంటికేషన్ యాప్‌లు, బయోమెట్రిక్ సెన్సార్‌లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపులను మరింత భద్రంగా మార్చచడమే లక్ష్యంగా ఈ దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది....