కుళ్లిన బియ్యమే వారికి ఆహారం..
మన దేశంలో బియ్యం ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే తింటారు. ఉత్తరాదిన గోధుమ పిండితో చేసిన చపాతీలను ఎక్కువగా తింటారు. కానీ బియ్యంతో చేసే అన్నన్ని..మన దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా తింటారు. బియ్యం ఏ మాత్రం పాడైపోయినా.. మనం పారేస్తాం. మిల్లర్లు కూడా చెత్తకుప్పల్లో వేస్తుంటారు. అలాంటి బియ్యాన్ని మనం అస్సలు తినలేము. కానీ ఉత్తర నైజీరియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు కుళ్లిన బియ్యాన్ని తింటారు. అవి పూర్తిగా రంగు మారి.. కంపుకొడుతున్నా.. అనారోగ్య సమస్యలు వచ్చినా.. వాటితోనే అన్నం వండుకొని తింటుంటారు. దీనికి కారణమేంటి..? బిబిసి నివేదిక ప్రకారం.. ఉత్తర నైజీరియాలో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు దుర్భర జీవితాన్ని...