ఈ నెల 28 న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాదు : ఈ నెల 28 న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, బంజారా కమిటీ సభ్యులతో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారా సాంప్రదాయ పూజ కార్యక్రమాలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. షామియానాలు, బారికేడింగ్, భోజనం, మరుగుదొడ్లు, త్రాగునీరు, వైద్యసేవలు, సౌండ్ సిస్టం, తదితర ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులకు కేటాయించడం జరిగిందని, సంబంధిత అధికారులు...