ఇప్పుడు ఎలా పట్టుకుంటారు..? పోలీస్ లకు సవాల్...

ఒకవేళ ఎవరైనా మిస్‌ అయితే..పోలీసులు ఎలా కనుక్కుంటారని 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, సీసీఫుటేజీల ఆధారంగా పోలీసులు ట్రేస్‌ చేసి పట్టుకుంటారని గూగుల్‌ నుంచి సమాధానం దొరికింది. అంతే..సెల్‌ఫోన్‌ను ఇంట్లో పడేశాడు..సీసీ కెమెరాలకు దొరక్కుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుని..చాకచక్యంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తనను ఎప్పటికీ కనుక్కోకూడదన్న ఆలోచనతో వెళ్లిపోయిన ఆ విద్యార్థి ఆచూకీ కనుగొనాలంటూ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్‌ కమలాపురికాలనీ ఫేజ్‌-2కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శైలేష్‌ కొనోడియా కుమారుడు జయేష్‌ కొనోడియా (17) ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాడు....