పూణె నగరంలో దోమల సుడిగాలి..
సాధారణంగా ఇంట్లో, పరిసరాల్లో దోమలు తిరుగుతుంటే చాలా భయం కలుగుతుంది. ఇవి కుడితే నొప్పితో పాటు వివిధ రకాల వ్యాధులు కూడా వస్తాయి. అయితే మహారాష్ట్రలోని పూణె (Pune) వాసులకు ఈ రిస్క్ భారీగా పెరిగిపోయింది. ఈ నగరం ప్రస్తుతం తీవ్రమైన దోమల సమస్యను ఎదుర్కొంటోంది. ఆ సమస్యకు అద్దం పట్టేలా తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నగరంలోని ఖరాడి ప్రాంతంలో షూట్ చేశారు. అందులో ఆకాశంలో భారీ సంఖ్యలో దోమలు 'సుడిగాలి' లేదా టోర్నడో (Mosquito Tornado) రూపంలో ఎగిసిపడ్డాయి. అవన్నీ కలిసి చాలా పొడవుగా ఒక టోర్నడో రూపంలో ఏర్పడి కుప్పలు తెప్పలుగా నగరంలోకి ప్రవేశిస్తున్నాయి....