యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టారో... ఇక అంతే సంగంతి...

హైదరాబాద్ : మనం ఎవరి చేతిలోనైనా మోసపోతే పోలీసుల వద్దకు వెళతాం... కొందరు పోలీసులు కూడా మోసగాళ్ల బారిన పడుతుంటారు... వాళ్లు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తారు. కానీ పోలీస్ బాసే సైబర్ నేరగాళ్ల బారినపడితే ఎవరికి చెప్పుకోవాలి... అలాంటి పరిస్థితే తెలంగాణ డిజిపి రవిగుప్తాకు ఎదురయ్యిందట. అయితే ముందుగానే అప్రమత్తంగా వుండటంతో మోసగాళ్లు డిజిపిని ఏం చేయలేకపోయారట. ఇలా సైబర్ నేరగాళ్లు తనను ఎలా మోసం చేయడానికి ప్రయత్నించారు... వారి నుండి ఎలా తప్పించున్నారో స్వయంగా తెలంగాణ పోలీస్ బాస్ బయటపెట్టారు.  హైదరాబాద్ లోకి పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిజిపి రవిగుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...