పిల్లి మాంసం తిన్న విద్యార్థి..!

ఆకలి మనిషిని ఎంత దూరం తీసుకువెళుతుందో చెప్పడానికి ఉత్తర కేరళలోని కుట్టిప్పురంలో ఘటనే తాజా ఉదాహరణ. ఇక్కడ బస్ స్టేషన్‌లో ఓ విద్యార్థి చనిపోయిన పిల్లి పచ్చి మాంసం తింటున్నాడు. ఈ ఘటనను చూసిన జనం ఒక్కసారి షాక్ అయ్యారు. అస్సాంకు చెందిన ఓ విద్యార్థి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చిమాంసాన్ని తినడం కనిపించింది. రద్దీగా ఉండే బస్టాండ్ లో కూర్చుని పిల్లి మాంసాన్ని తినడం అక్కడి జనాలు గమనించారు. ఆ విద్యార్థిని అస్సాం రాష్ట్రానికి చెందిన వాడుగా గుర్తించాడు. బస్టాండ్ మెట్లపై కూర్చని పిల్లిమాంసం తింటున్నట్లు స్థానికులు గమనించారని..ఓ పోలీస్ అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న తర్వాత ఘటన స్థలానికి చేరుకుని...