TS కాదు ఇక నుంచి TG..!?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు మార్చే ఉద్యమాన్ని కూడా చేపట్టారు. తెలంగాణ వాదులంతా ఏపీని తీసేసి TG అని పెట్టుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమకారులు అదే చేశారు. అయితే తీరా తెలంగాణ ఏర్పడిన తరవాత TG అనే కోడ్ ను కాకుండా.. TS అంటే తెలంగాణ స్టేట్ అనే కోడ్ ను ఎంచుకున్నారు. అప్పట్లో ఎవరూ ప్రశ్నించలేదు. ప్రశ్నించే అంత ధైర్యం ఎవరికీ లేకపోయింది. అందుకే టీఎస్ పేరుతో వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. టీఆర్ఎస్ బలం తెలంగాణ...