కాల్లో ముల్లుకు 55 ఆపరేషన్లు!

బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో! కాల్లో ముల్లు దిగిన మహిళకు ఏకంగా 55 ఆపరేషన్లు! కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాముగా మారి కాటేస్తుందనేది ఓ నానుడి. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఆమెకు ఫిషింగ్ హుక్ కాల్లో దిగింది. చిన్న ముల్లు గుచ్చుకున్నట్టు ఉండటంతో ఆమె విషయాన్ని పట్టించుకోలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితి దారుణంగా తిరగబడింది. ఫలితంగా ఆమె ఐదేళ్లలో ఏకంగా 55 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె కాల్లో కొంత కండ తొలగించడంతో ఆ ప్రాంతంలో చిన్న గొయ్యిలాంటిది ఏర్పడింది. ఇంగ్లండ్‌లోని స్టాన్‌ఫర్డ్‌-లీ-హోప్ ప్రాంతంలో నివసించే మిషెల్ మిల్టన్...