తిరుపతిలో శనివారం తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి:జనవరి 06 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడు తుందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులుస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుం టున్నారు. కాగా, శుక్రవారం శ్రీవారి 57,441మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమ లలో నిన్న 20,878 మంది భక్తులు నిన్న శ్రీవారికి తల నీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదా యం రూ.3.66కోట్లు వచ్చిం దని టిటిడి అధికా రులు వెల్లడించారు...