చెట్లను పశువులను జంతువులను పూజించే సంస్కృతి సాంప్రదాయం సనాతన హిందూ ధర్మం లో మాత్రమే ఉంది
వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ మాదాపూర్ ఇంద్రవెల్లి : సనాతన హిందూ ధర్మ సంస్కృతి చాలా గొప్పదని ఈ హిందూ సంస్కృతిలో చెట్లని పశువులని జంతువులని పూజించే సంస్కృతి ప్రపంచంలోనే మన హిందూ ధర్మ సనాతన ధర్మంలో ఉందని వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ అన్నారు. ఆదివారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని గిరిజనుల ఆరాధ్య దైవమైన కిస్లాపూర్ నాగోబా ఆలయం ఆవరణంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగే సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నారాయణ మహారాజుని ముఖ్య అతిథులుగా పిలిచి భజన సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మహారాజు మాట్లాడుతూ ఈరోజు నాగోబా ఆలయంలో భజన కీర్తన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన...